మే 23 తర్వాత ఆ రెండు పార్టీల అడ్రస్‌ గల్లంతు : లక్ష్మణ్‌

BJP Leader K Laxman Fires On KCR Over Inter Board Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ బోర్డు వైఫల్యం, గ్లోబరినా సంస్థ పనితీరు, సార్వత్రిక ఎన్నికల వంటి పలు అంశాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఒక్క టీచర్‌ పోస్ట్‌ కూడా భర్తీ కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూనివర్సీటీలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో పని చేసే ట్యూటర్స్‌తో ఇంటర్‌ పరీక్ష పేపర్లను దిద్దించారని ఆయన ఆరోపింపచారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకేసుకొస్తుందని మండిపడ్డారు.

నేటికి కూడా తెలంగాణలో దాదాపు వెయ్యికి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని లక్ష్మణ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే.. రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలు దేరారని కేసీఆర్‌ని విమర్శించారు. మంచి చదువుల కోసం విద్యార్థులను గ్రామాల నుంచి పట్టణాలకు పంపితే ఆత్మహత్యలే దిక్కవతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్డీఏ రిపోర్టు ప్రకారం వెనకబడ్డ రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనకబడి ఉందని ఆయన తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఎవరి మద్దతు లేకుండానే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. మే 23 తర్వాత కాంగ్రెస్‌, టీడీపీల అడ్రస్‌ గల్లంతవుతుందని తెలిపారు. మోదీ హయాంలో ఇండియాలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం తగ్గిపోయాయని.. నిత్యావసర వస్తువుల ధరలు దిగొచ్చాయని పేర్కొన్నారు. వారణాసిలో నామినేషన్‌ వేసిన వారంతా టీఆర్‌ఎస్‌ ఏజెంట్లే అని లక్ష‍్మణ్‌ ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top