కరోనా కట్టడిపైనే దృష్టిపెట్టాలి: భట్టి | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడిపైనే దృష్టిపెట్టాలి: భట్టి

Published Wed, Jul 22 2020 6:49 AM

Bhatti Vikramarka Slams On KCR Over Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను పక్కనబెట్టి కరోనా కట్టడిపైనే దృష్టి కేంద్రీ కరించాలని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన కరోనా బాధితులు సదుపాయాలు లేవంటూ వీడియోల ద్వారా ఏడుస్తూ చెబుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌  పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైన్‌షాపుల వద్ద భౌతికదూరం పాటించడంలేదని, దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతి చావుకు సీఎం కేసీఆరే బాధ్యుడని, ఆయనకు ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదన్నారు.  ప్రభుత్వాస్పత్రుల్లో 700 మంది డాక్టర్ల కొర త ఉందని, ఆరేళ్ల నుం చి వైద్యులను నియమించడం లేదని తెలిపారు.  

భ్రష్టు పట్టించారు: నీటిపారుదల శాఖను కేసీఆర్‌ భ్రష్టు పట్టించారని భట్టి వ్యాఖ్యానించారు. ఆ శాఖ లో బిజినెస్‌ రూల్స్‌ పాటించట్లేదని, ఏడేళ్ల క్రితం రి టైర్‌ అయిన ఈఎన్‌సీ చేత ఇరిగేషన్‌ నిధులను ఖ ర్చు చేయిస్తున్నారని, ఆయన కేసీఆర్‌ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాడన్నారు. ఆ శాఖలో బిజినెస్‌ రూల్స్‌ పాటించకపోవడానికి సీఎ స్‌ సోమేశ్‌కుమార్‌ను కూడా బాధ్యుడిని చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని భట్టి చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement