బెంగాల్లో ప్రాంతీయం వర్సెస్‌ జాతీయం

Bengal Versus Nationalism - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు లోక్‌సభకు జరిగిన ఆరు విడతల పోలింగ్‌ అన్నింటిలోనూ హింసాకాండ చెలరేగింది. మరో ఐదు రోజుల్లో ఆఖరి ఏడో విడత పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో మంగళవారం నాడు పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్, విపక్ష బీజేపీ–సంఘ్‌ కార్యకర్తల మధ్య మరోసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రోడ్డు షో ర్యాలీ కోల్‌కతాలోని సిటీ కాలేజీ గేటు ముందు నుంచి వెళుతుండగా, ‘అమిత్‌ షా గోబ్యాక్‌’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థులు నినాదాలు చేయడంతో గొడవ మొదలయింది. ఈ సందర్భంగా తృణమూల్, ఏబీవీపీ–బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు.

రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు సమీపంలోని విద్యాసాగర్‌ కాలేజీ గేట్లు విరగ్గొట్టుకొని జొరపడ్డారు. కళాశాల ఆవరణలోని సైకిల్‌ మోటార్లను తగులబెట్టి ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో ఇరువర్గాల ఘర్షణ మరింత తీవ్రమైంది. పెద్ద ఎత్తున పోలీసు దళాలు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన విద్యాసాగర్‌ కాలేజీకి వెళ్లి అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసిన చోటు నుంచే ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ ఎవరో తెలియని మూర్ఖులని బీజేపీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి వెంట స్థానికులు ఎక్కువగా లేరని, అంతా యూపీ, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌ నుంచి తీసుకొచ్చిన గూండాలు ఉన్నారని ఆరోపించారు. విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూల్చివేసినందుకు తాను అమితా షాను ‘గూండా’గా పిలుస్తానని కూడా అన్నారు.

ఈ విద్యాసాగర్‌ ఎవరు?
పశ్చిమ బెంగాల్‌ పునరుత్థానానికి ప్రధాన కారకుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌. తత్వవేత్త, విద్యావేత్త, రచయిత, కవి. బెంగాలీ భాషకు సరైన అక్షరమాలను సమకూర్చినవారు. అన్ని కులాల బాలబాలికలకు విద్య అందుబాటులో ఉండాలంటూ పలు పాఠశాలలను ఏర్పాటు చేసిన ప్రముఖ సామాజిక వేత్త. 1856లో హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం రావడానికి కూడా ఆయనే కారణం. ఆయన 1820లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాది నుంచి వచ్చిన బీజేపీ నేతలకు ఏం తెలుసు బెంగాల్‌ సంస్కృతి గురించి అంటూ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్న మమతా బెనర్జీకి ఇప్పుడు విగ్రహం విధ్వంసం మరో ఆయుధమైంది. 2021లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీ స్థానిక సంస్కృతి పేరుతో బీజేపీని కొట్టాలని చూస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఫొటో మార్పు
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఇప్పటి వరకున్న మమతా బెనర్జీ ఫొటో స్థానంలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ ఫొటోను పెట్టారు. మరోపక్క హింసాకాండకు నిరసనగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్‌ 22వ తేదీన బెంగాల్‌లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెంగాలి కవి రవీంద్ర నాథ్‌ ఠాగోర్‌ భీర్బమ్‌ జిల్లాలో జన్మించారంటూ తప్పుగా మాట్లాడారు. ఠాగోర్, కోల్‌కతాలో జన్మించిన విషయం తెల్సిందే. బెంగాల్‌ గురించి బీజేపీ నేతలకు ఏమీ తెలియదనడానికి అమిత్‌ షా మాటలే నిదర్శనమని, బెంగాల్‌ ప్రజలను వారు అవమానిస్తున్నారంటూ తృణమూల్‌ నేతలు విరుచుకుపడ్డారు. బెంగాల్‌ ‘కంగాల్‌’ అంటూ అమిత్‌ షా వ్యాఖ్యలపై కూడా వారు మండిపడ్డారు. బెంగాల్‌కు అనుకూలంగా ఓటేస్తారో, వ్యతిరేకంగా ఓటేస్తారో తేల్చుకోండంటూ మొదటిసారి ఓటర్లకు పిలుపునిస్తూ ఓ పాఠను కూడా ప్రచారంలో పెట్టారు.

బీజేపీ ‘జై శ్రీరామ్‌’ నినాదాలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ ఎన్నికల సభల్లో ఎక్కువగా దుర్గా దేవీ గురించి, దుర్గా పూజ గురించి ప్రస్తావిస్తున్నారు. బీజేపీ జాతీయవాదం, మమతా బెంగాల్‌వాదం విజయం సాధిస్తుందో చూడాలి. ఏడవ విడత కింద మే 19వ తేదీన కోల్‌కతాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఈ రెండు పట్టణం సీట్లు అవడం వల్ల, ఎక్కువ మంది మధ్యతరగతికి చెందిన ప్రజలు ఉండడం వల్ల ఈ రెండు సీట్లలో మమత ప్లాన్‌ విజయవంతం కావచ్చు. యూపీలో నష్టపోతున్న సీట్ల స్థానంలో బెంగాల్‌లో 42కుగాను 23 సీట్లను దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు

15-05-2019
May 15, 2019, 14:02 IST
ప్రధాని పదవికి మోదీ అన్‌ఫిట్‌..
15-05-2019
May 15, 2019, 13:11 IST
సాక్షి, వికారాబాద్‌: కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు...
15-05-2019
May 15, 2019, 12:47 IST
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ...
15-05-2019
May 15, 2019, 11:56 IST
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ధర్నాలు, ఆదోళనలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయం...
15-05-2019
May 15, 2019, 09:52 IST
లక్నో: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల  మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  చివరి...
15-05-2019
May 15, 2019, 08:39 IST
కోల్‌కత్తా: ఎన్నికల సమయంలో బెంగాల్‌లో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ...
15-05-2019
May 15, 2019, 08:21 IST
ముంబై : నేను ఇప్పుడు సరైన, ఉత్తమమైన దారిలోనే వెళ్తున్నాను. దీనికి అద్వానీజీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు నటుడు, కాంగ్రెస్‌...
15-05-2019
May 15, 2019, 08:07 IST
పంజాబీ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన డోల్‌ను భలే రంజుగా వాయిస్తున్న ఈ ఫొటోలో అమ్మాయి జహన్‌ గీత్‌ దేవల్‌....
15-05-2019
May 15, 2019, 07:52 IST
హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్‌ జరుగుతుంది.  2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని...
15-05-2019
May 15, 2019, 07:39 IST
పశ్చిమబెంగాల్‌లోని 9 లోక్‌సభ స్థానాలకు మే 19న చివరిదశలో పోలింగ్‌ జరుగుతుంది. కోల్‌కతా నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని డైమండ్‌...
15-05-2019
May 15, 2019, 06:58 IST
శ్రామికవర్గం కోసం పోరాటమే పునాదిగా పుట్టుకొచ్చిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మతతత్వ పార్టీకి మద్దతిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజకీయ...
15-05-2019
May 15, 2019, 03:53 IST
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 19వ తేదీతో అన్ని దశల ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వెలువడే ఎగ్జిట్‌...
14-05-2019
May 14, 2019, 20:26 IST
కోల్‌కతా : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతా ర్యాలీ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ-...
14-05-2019
May 14, 2019, 19:11 IST
మోదీపై రాహుల్‌ గరం..గరం..
14-05-2019
May 14, 2019, 18:23 IST
కమల్‌పై పటియాలా హౌస్‌ కోర్టులో క్రిమినల్‌ కంప్లైంట్‌
14-05-2019
May 14, 2019, 17:52 IST
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడు చిటపటలాడుతున్నట్లు కనిపిస్తారు.
14-05-2019
May 14, 2019, 15:21 IST
జాతిపితను హతమార్చిన నాథూరామ్‌ గాడ్సే నిజమైన ఉగ్రవాది..
14-05-2019
May 14, 2019, 15:09 IST
‘యూపీలో బీజేపీకి దక్కే స్ధానాలు ఇవే’
14-05-2019
May 14, 2019, 14:19 IST
మహారాష్ట్ర, యూపీలో బీజేపీకి ఎన్ని సీట్లు తగ్గుతాయంటే..?
14-05-2019
May 14, 2019, 14:18 IST
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలకమైన డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ రాజకీయ అడుగులు ఇప్పుడు తీవ్ర ఆసక్తి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top