జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్‌ సంకేతాలు | Ashok Gehlot Hints Congress JD-S Partnership Possible | Sakshi
Sakshi News home page

జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్‌ సంకేతాలు

May 15 2018 10:00 AM | Updated on Aug 14 2018 4:46 PM

Ashok Gehlot Hints Congress JD-S Partnership Possible - Sakshi

కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీకి చేరువవుతున్నా కాంగ్రెస్‌ చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సన్నాహాలు ప్రారంభించింది. ఆ పార్టీ నేతలు జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో మంతనాలు జరుపుతుండగా తాజాగా ఎన్నికల అనంతర పొత్తులపై కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ స్పష్టత ఇచ్చారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గెహ్లాట్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జేడీఎస్‌తో పొత్తు సహా ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని చెప్పారు. కాగా క్షణక్షణానికీ మారుతూ ఉత్కంఠకు లోనుచేసిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో తాజాగా బీజేపీ  స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement