ప్రీ మేనిఫెస్టో విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్‌ | AP PCC Chief Raghuveera Reddy Announced AP Congress Free Manifesto | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రీ మేనిఫెస్టో విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్‌

Oct 1 2018 3:03 PM | Updated on Mar 23 2019 9:10 PM

AP PCC Chief Raghuveera Reddy Announced AP Congress Free Manifesto - Sakshi

సాక్షి, విజయవాడ : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీచేస్తామని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్నారు.

బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను షెడ్యూల్ 9లో కలుపుతామన్నారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన సలహాలు, సూచలను పరిగణలోకి తీసుకొని ఫైనల్‌ మేనిఫెస్టోని తయారు చేస్తామని రఘువీరా పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement