వైఎస్సార్‌సీపీలోకి పెద్ద ఎత్తున వలసలు | 300 Families Of TDP Joined Congress In Krishna District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి పెద్ద ఎత్తున వలసలు

Dec 9 2018 8:12 PM | Updated on Dec 9 2018 8:12 PM

300 Families Of TDP Joined Congress In Krishna District - Sakshi

యార్లగడ్డ వెంకట్రావు

జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు దోపిడీ చేస్తున్నార..

విజయవాడ రూరల్‌: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్‌సీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో  టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి సుమారు 300 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరికి గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు.

జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరగడం లేదు కాబట్టే టీడీపీ నుంచి 300 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ చేరాయని స్ఫష్టంగా పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకోవడంలో మునిగిపోయారని తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement