
సాక్షి, మంగళగిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, భరోసానిస్తూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు. బుధవారం ఉదయం వైఎస్ జగన్ అంబేడ్కర్ సర్కిల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నవులూరు క్రాస్, ఎర్రబాలెం మీదుగా పెనుమాక చేరుకుంటారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ ఉండవల్లి చేరుకొని బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.