గురజాడ శతవర్ధంతి కార్యక్రమాలు

గురజాడ శతవర్ధంతి కార్యక్రమాలు


ఈ రోజంతా విశాఖ పట్నంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం అసెంబ్లీ హాల్లో గురజాడ శతవర్ధంతిని శతాధిక సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. ‘గురజాడ-ఆధునిక భావాలు’, ‘గురజాడ-మహిళలు’, ‘గురజాడ రచనలు - సమకాలీనత’, ‘భావ ప్రకటనాస్వేచ్ఛ- సవాళ్లు’ అంశాలపై ప్రసంగాలుంటాయి. ‘భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము’ ఆధ్వర్యంలో నేడు, రేపు విజయనగరంలో ‘గురజాడ శత వర్ధంతి సారస్వత నీరాజనం’ పేరిట వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. డైరీ: నేడు ఉదయం 9:30కి గురజాడ స్వగృహంలో ‘జ్యోతి ప్రదీపనం’, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తైలవర్ణ చిత్ర ప్రదర్శన. 10:30కి ఆనందగజపతి కళాక్షేత్రంలో ‘మహాకవి గురజాడ’, ‘గురజాడ-మహిళ’ నృత్యరూపకాలు. 2 గంటలకు నవయుగ ఆర్ట్స్ వారిచే 8 గంటల సంపూర్ణ ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన. నవంబర్ 30న ఉదయం 9:30కు ‘సాంస్కృతిక పాదయాత్ర’. 11:30కు ‘ప్రముఖ వక్తలతో సాహితీ సదస్సు’. 3 గంటలకు ‘కవి సమ్మేళనం’. 6 గంటలకు ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’, ‘దేశమును ప్రేమించుమన్న’ నృత్యరూపకాలు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ‘గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం’. మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు ‘మహాకవి గురజాడ అప్పారావు 100వ వర్ధంతి జాతీయ సదస్సు’ జరగనుంది. గురజాడ జీవితప్రస్థానం, లేఖలు, డైరీలు, కథానికలు, కవిత్వం, కన్యాశుల్కం అంశాలపై ప్రసంగాలుంటాయి. ‘మొజాయిక్ సాహిత్య సంస్థ’, మరికొన్ని కలిసి ‘గురజాడ నూరో వర్ధంతి’ని నవంబర్ 30న మధ్యాహ్నం 2:30కు ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్లో నిర్వహిస్తున్నాయి. ఇందులో, ‘గురజాడ- నేటి అవసరం’ చర్చ, రామతీర్థ సంక్షిప్తీకరించిన ‘కన్యాశుల్కం’ ఆవిష్కరణ, ‘జెండాపై గురజాడ’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఉంటాయి. ‘తెలుగు రథం’, ‘శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్’ ఆధ్వర్యంలో నవంబర్ 30 సాయంత్రం 5:30కు త్యాగరాయ గానసభలో జరిగే ‘గురజాడ శతవర్ధంతి నివాళి’ సభలో ‘అక్షర’(నివాళి కవిత్వం), ‘తప్పక చదవాల్సిన వంద కథానికల మాలిక’ పుస్తకావిష్కరణలు జరగనున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top