breaking news
Language and cultural branch
-
గురజాడ శతవర్ధంతి కార్యక్రమాలు
ఈ రోజంతా విశాఖ పట్నంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం అసెంబ్లీ హాల్లో గురజాడ శతవర్ధంతిని శతాధిక సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. ‘గురజాడ-ఆధునిక భావాలు’, ‘గురజాడ-మహిళలు’, ‘గురజాడ రచనలు - సమకాలీనత’, ‘భావ ప్రకటనాస్వేచ్ఛ- సవాళ్లు’ అంశాలపై ప్రసంగాలుంటాయి. ‘భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము’ ఆధ్వర్యంలో నేడు, రేపు విజయనగరంలో ‘గురజాడ శత వర్ధంతి సారస్వత నీరాజనం’ పేరిట వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. డైరీ: నేడు ఉదయం 9:30కి గురజాడ స్వగృహంలో ‘జ్యోతి ప్రదీపనం’, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తైలవర్ణ చిత్ర ప్రదర్శన. 10:30కి ఆనందగజపతి కళాక్షేత్రంలో ‘మహాకవి గురజాడ’, ‘గురజాడ-మహిళ’ నృత్యరూపకాలు. 2 గంటలకు నవయుగ ఆర్ట్స్ వారిచే 8 గంటల సంపూర్ణ ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన. నవంబర్ 30న ఉదయం 9:30కు ‘సాంస్కృతిక పాదయాత్ర’. 11:30కు ‘ప్రముఖ వక్తలతో సాహితీ సదస్సు’. 3 గంటలకు ‘కవి సమ్మేళనం’. 6 గంటలకు ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’, ‘దేశమును ప్రేమించుమన్న’ నృత్యరూపకాలు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ‘గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం’. మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు ‘మహాకవి గురజాడ అప్పారావు 100వ వర్ధంతి జాతీయ సదస్సు’ జరగనుంది. గురజాడ జీవితప్రస్థానం, లేఖలు, డైరీలు, కథానికలు, కవిత్వం, కన్యాశుల్కం అంశాలపై ప్రసంగాలుంటాయి. ‘మొజాయిక్ సాహిత్య సంస్థ’, మరికొన్ని కలిసి ‘గురజాడ నూరో వర్ధంతి’ని నవంబర్ 30న మధ్యాహ్నం 2:30కు ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్లో నిర్వహిస్తున్నాయి. ఇందులో, ‘గురజాడ- నేటి అవసరం’ చర్చ, రామతీర్థ సంక్షిప్తీకరించిన ‘కన్యాశుల్కం’ ఆవిష్కరణ, ‘జెండాపై గురజాడ’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఉంటాయి. ‘తెలుగు రథం’, ‘శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్’ ఆధ్వర్యంలో నవంబర్ 30 సాయంత్రం 5:30కు త్యాగరాయ గానసభలో జరిగే ‘గురజాడ శతవర్ధంతి నివాళి’ సభలో ‘అక్షర’(నివాళి కవిత్వం), ‘తప్పక చదవాల్సిన వంద కథానికల మాలిక’ పుస్తకావిష్కరణలు జరగనున్నాయి. -
రాజమండ్రిలో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం
అధికార భాషా సంఘం చైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చూస్తాం తెలుగు భాషా దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విభజన పూర్తయిన వెంటనే రాజమండ్రిలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. లలిత, సాహిత్య, సంగీత, నాటక అకాడమీలను త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇకపై ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార భాషా సంఘాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. దాని చైర్మన్‌గా తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు. హరికృష్ణతోపాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌లతో ఒక కమిటీని వేసి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.