దొరల రాజ్యం ఒక కట్టుకథ: సీపీ కార్తికేయ | A fairytale is a fable: cp karthikeya | Sakshi
Sakshi News home page

దొరల రాజ్యం ఒక కట్టుకథ: సీపీ కార్తికేయ

Dec 11 2017 6:42 PM | Updated on Dec 11 2017 7:05 PM

A fairytale is a fable: cp karthikeya - Sakshi

సాక్షి, నిజామాబాద్ : దళితులను అవమానించిన కేసులో బీజేపీ మాజీ నాయకుడు భరత్ రెడ్డిని అరెస్ట్‌ చేసి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విలేకరులతో నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. దొరల రాజ్యం సినిమా ఒక కట్టుకథ అని తేల్చారు. అక్రమంగా మొరం తరలిస్తున్నందుకే అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్ రెడ్డి అవమానించాడని పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కేసరికి సినిమా షూటింగ్‌ అని కొత్త నాటకానికి తెరలేపాడని వెల్లడించారు.

పోలీసులకు దొరక్కుండా హైదరాబాద్, జోగులాంబ, హంపి, కడప ప్రాంతాల్లో బాధితులను వెంట వేసుకొని తిప్పాడని వివరించారు. భరత్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెడతామని, మరింత విచారణ కోసం కస్టడీ కోరతామని తెలిపారు. అభంగపట్నంలో పికెటింగ్ కొనసాగిస్తామని,  అవసరం అయితే మరింత పెంచుతామని సీపీ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement