స్నేహితురాలి కూతురిని తీసుకెళ్లి.. | Woman gets friend's daughter gang-raped for money | Sakshi
Sakshi News home page

స్నేహితురాలి కూతురిని తీసుకెళ్లి..

Jan 10 2016 9:47 AM | Updated on Aug 1 2018 4:24 PM

స్నేహితురాలి కూతురిని తీసుకెళ్లి.. - Sakshi

స్నేహితురాలి కూతురిని తీసుకెళ్లి..

పశ్చిమబెంగాల్లోని దక్షిణ దీనజ్పూర్ జిల్లాలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.

కోల్కతా: పశ్చిమబెంగాల్లోని దక్షిణ దీనజ్పూర్ జిల్లాలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. డబ్బుల కోసం స్నేహితురాలి మైనర్ కూతురు (14) ను.. నలుగురు వ్యక్తులకు అప్పగించి సామూహిక అత్యాచారం చేయించింది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళ సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితురాలు స్నేహితురాలి కూతురును బలుర్గాట్ పట్టణంలో ఓ ఇంటికి తీసుకెళ్లి నలుగురు దుండగులకు అప్పగించింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిందితులు ఆ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటికి తిరిగొచ్చి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement