ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు

Two Positive Cases Of Corona Virus Detected In Delhi And Telangana - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (కోవిడ్‌-19) తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాకుండా ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వీరిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆదివారం రోజున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడనున్నారు.  చదవండి: చైనా వెలుపల కోవిడ్‌ మృతులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top