రెండు గంటల్లో.. రెండు బ్యాంకుల్లో దోపిడీ | two banks looted in two hours in Kashmir's Pulwama | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లో.. రెండు బ్యాంకుల్లో దోపిడీ

May 3 2017 9:19 PM | Updated on Sep 5 2017 10:19 AM

రెండు గంటల్లో.. రెండు బ్యాంకుల్లో దోపిడీ

రెండు గంటల్లో.. రెండు బ్యాంకుల్లో దోపిడీ

కశ్మీర్‌ బ్యాంకుల్లో మిలిటెంట్ల దోపిడీ కొనసాగుతోంది.

శ్రీనగర్ ‌:
కశ్మీర్‌ బ్యాంకుల్లో మిలిటెంట్ల దోపిడీ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 1.50 కి వాహిబుగ్‌లో ఉన్న ఇలాకి దెహతి బ్యాంకులోకి నలుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించి సిబ్బందిపై తుపాకి గురిపెట్టి రూ.3-4 లక్షల నగదుతో పరారయ్యారు.

బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దొంగలను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30కి అదే జిల్లాలో జమ్మూ కశ్మీర్‌ బ్యాంకు నెహమా శాఖలో కూడా మిలిటెంట్లు దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడి నుంచి ఎంత మొత్తం తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. గత మూడు రోజులు నుంచి దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement