ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి | Three Mao killed in encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

Mar 26 2018 4:38 AM | Updated on Oct 9 2018 2:39 PM

Three Mao killed in encounter - Sakshi

మల్కన్‌గిరి: ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా డోగ్రీఘాట్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు ఐజీ ఎస్‌ షైనీ తెలిపారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్‌ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతంలో కిట్‌ బ్యాగులు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. కొరాపుట్‌ జిల్లాలో 24 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement