హైదరాబాద్‌ నుంచి తీవ్రవాదుల తరలింపు | Terrorists of Dilsuknagar bomb blasts shifted to mumbai | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి తీవ్రవాదుల తరలింపు

Feb 2 2017 7:32 PM | Updated on Sep 28 2018 4:46 PM

హైదరాబాద్‌ నుంచి తీవ్రవాదుల తరలింపు - Sakshi

హైదరాబాద్‌ నుంచి తీవ్రవాదుల తరలింపు

దిల్‌షుక్‌నగర్‌ పేలుళ్ల నిందితులను ఢిల్లీ, ముంబై జైళ్లకు తరలించారు.

హైదరాబాద్‌:
దిల్‌షుక్‌నగర్‌ పేలుళ్ల నిందితులను ఢిల్లీ, ముంబై జైళ్లకు తరలించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌తో పాటు మరో ఇద్దరిని తీహార్‌ జైలుకు, మిగతా ఇద్దరు ఉగ్రవాదులను ముంబైకి గురువారం విమానంలో తరలించినట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

యాసిన్‌ భత్కల్‌తో పాటు ఇద్దరిని ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు, ముంబై తరలించిన ఇద్దరినీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ బృందాలు ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement