ఛత్తీస్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ మృతి | Telangana Maoist party calls for statewide bandh over recent encounter killings | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ మృతి

Apr 29 2018 3:55 AM | Updated on Oct 9 2018 2:39 PM

Telangana Maoist party calls for statewide bandh over recent encounter killings - Sakshi

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలో ఇటీవల అతి పెద్ద ఎన్‌కౌంటర్‌ సమయంలో తప్పించుకున్న మావోలు కొందరు ఛత్తీస్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్నారనే అనుమానంతో పోలీసు బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.

ఈ క్రమంలో సుకుమా జిల్లాలోని చింతల్‌నార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల నడుమ గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. ఆయుధాలు, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం దొరికాయి. మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement