సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు.. | Tea Stall Owner Shoots Step Father In Delhi | Sakshi
Sakshi News home page

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

Jul 20 2019 4:45 PM | Updated on Jul 20 2019 6:09 PM

Tea Stall Owner Shoots Step Father In Delhi  - Sakshi

ఢిల్లీ: తన తల్లిని వేదించిన సవతి తండ్రిని కాల్చి చంపిన ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో శుక్రవారం జరిగింది. సవతి తండ్రి అనిల్ అలియాస్ అనాస్ (35) ను చంపిన అనంతరం మున్నా ఖాన్ (24) పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని విచారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ గౌరవ్‌ శర్మ మీడియాకు తెలిపారు. నిందితుడు స్థానికంగా  టీ స్టాల్‌ ను  నడుపుతు జీవనం వెళ్లదీసున్నాడని తెలిపారు. తన తల్లిని నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడనే ఆవేదనతోనే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించాడని పోలీసులు పేర్కొన్నారు. బిహార్ నుంచి దేశీయ పిస్టల్‌ను కొనుగోలు చేశానని నిందుతుడు పోలీసులకు తెలిపాడు. అతడి దగ్గర ఉన్న పిస్టల్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement