త్వరలో పన్ను వ్యవస్థలో సంస్కరణలు : కేంద్ర ఆర్థిక మంత్రి

Tax System Will Soon Be Reformed Says Finance Minister Nirmala Sitharaman - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో పన్ను వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపడుతామని చెప్పారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నా.. అదుపులోనే ఉందని తెలిపారు. త్వరలో పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో నిర్మలా శనివారం  మీడియాతో మాట్లాడుతూ..
(చదవండి : ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం)

ఇల్లు కొనేవారికి రాయితీలు..
‘వస్తువుల ఎగుమతులపై పన్నులు తగ్గించే యోచన చేస్తున్నాం. ఇల్లు కొనేవారికి మరిన్ని రాయితీలు అందజేస్తాం. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్న సంకేతాలున్నాయి. అదనంగా కట్టిన జీఎస్టీ, ఆదాయపు పన్నును ఆన్‌లైన్‌లో వెనక్కి ఇచ్తేస్తాం. ఎగుమతులకిచ్చే బ్యాంకు రుణాలకు ఇన్సూరెన్స్‌తో గ్యారంటీ కల్పిస్తాం. వివిధ రుణాలకిచ్చే వడ్డీ రేటు దాదాపు 4 శాతం తగ్గించాం. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన చర్యలు ఉండవు. ఐటీ రిటర్న్స్‌లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో భారత్‌ స్థానం మెరుగైంది. ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా ఎంఈఐఎస్‌ అనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం. ఎంఈఐఎస్‌ వల్ల టెక్స్‌టైల్స్‌ రంగంతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం ఉంటుంది’అన్నారు.

(చదవండి : ఆర్థిక వ్యవస్థ అద్భుతం..మరి ఉద్యోగాలు ఎక్కడ..?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top