
ఏడుపు లంకించుకున్న సీఎం, మంత్రులు
ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేయగానే ఒక్కసారిగా అందరూ ఏడుపు మొదలుపెట్టారు.
ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి, ఆయనతో పాటు ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారంటే.. అక్కడంతా సందడి సందడిగా ఉంటుంది. అందరూ ఎంతో ఆనందంగా కనిపిస్తారు. అభినందనలు వెల్లువెత్తుతుంటాయి. కానీ, తమిళనాడులో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే నాయకుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా కొత్తగా మళ్లీ ప్రమాణాలు చేశారు.
వాళ్లలో ప్రతి ఒక్కరూ జయలలితకు వీరాభిమానులు, ఒకరకంగా పాదాక్రాంతులే. అందుకే.. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ ఒక్కసారిగా ఏడ్చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కళ్లనీళ్లు కక్కుకున్నారు. వైద్యలింగం, వలార్మత్తి, తంగమణి.. ఇలాంటి సీనియర్లు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు. దాంతో అక్కడ ప్రమాణస్వీకార కార్యక్రమం కాస్తా సంతాప కార్యక్రమంలా కనిపించింది.