ఆయుధాల చోరీ చేసి ఉగ్రవాదుల పరారీ | Suspected Terrorists Flee After Snatching 4 Rifles From Policemen In Kashmir | Sakshi
Sakshi News home page

ఆయుధాల చోరీ చేసి ఉగ్రవాదుల పరారీ

May 8 2016 2:32 PM | Updated on Sep 3 2017 11:41 PM

జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆయుధాలతో సహా పరారైన ఘటన కుల్గామ్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆయుధాలతో సహా పరారైన ఘటన కుల్గామ్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. అధికారుల సమాచారం మేరకు... గుర్తుతెలియని కొందరు ఉగ్రవాదులు కుల్గామ్ జిల్లా అడిజన్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో చొరబడ్డారు. పోలీసుల వద్ద ఉన్న 4 రైఫిళ్లను చోరీ చేసినట్లు తెలిపారు. రెండు ఎస్ఎల్ఆర్ లు, రెండు ఇన్ సాస్ రైఫిల్స్ ఉన్నట్లు వివరించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement