‘సల్మాన్ తాగి నడిపారు’ | Supreme Court to hear Maharashtra Government's plea against Salman acquittal in hit-and-run case | Sakshi
Sakshi News home page

‘సల్మాన్ తాగి నడిపారు’

Feb 6 2016 2:04 AM | Updated on Apr 3 2019 6:23 PM

‘సల్మాన్ తాగి నడిపారు’ - Sakshi

‘సల్మాన్ తాగి నడిపారు’

2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. మద్యం తాగి వాహనం నడిపారని మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు నివేదించింది.

 న్యూఢిల్లీ: 2002 నాటి హిట్ అండ్ రన్  కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. మద్యం తాగి వాహనం నడిపారని మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు నివేదించింది. కేసులో సల్మాన్‌కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వటంపై సుప్రీంలో సవాల్ చేసిన  సర్కారు.. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది.

ప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఘటన జరిగిన రోజు సల్మాన్ వాహనం నడుపగా.. ఆయన డ్రైవర్ వెనకాల సీట్లో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పుకు హేతుబద్ధత లేదని.. న్యాయ వ్యవస్థను అవహేళన చేసినట్లుందన్నారు. కేసు విచారణను కోర్టు ఈ నెల 12కు  వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement