ఎదురుకాల్పుల్లో మహిళా నక్సల్‌ మృతి | sukma: Woman Naxal killed in encounter | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో మహిళా నక్సల్‌ మృతి

Jan 30 2017 7:04 PM | Updated on Sep 5 2017 2:29 AM

ఎదురుకాల్పుల్లో మహిళా నక్సల్‌ మృతి

ఎదురుకాల్పుల్లో మహిళా నక్సల్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది.

రాయిపూర్‌(ఛత్తీస్‌గఢ్‌):
తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. సుక్మా జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటనపై ఎస్పీ ఇందిరా కల్యాణ్‌ తెలిపిన వివరాలివీ..కోబ్రా, సీఆర్పీఎఫ్‌, పోలీసు బలగాలు సోమవారం మధ్యాహ్నం చింతగుఫ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దూలేర్‌ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.

ఈ సందర్భంగా వారిపైకి మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు ఆగిన తర్వాత ఆప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కనిపించింది. పక్కనే పడి ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement