సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు! | Sonia gandhi cancels Maharashtra rallies, citing ill health | Sakshi
Sakshi News home page

సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు!

Apr 20 2014 3:09 PM | Updated on Mar 18 2019 9:02 PM

సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు! - Sakshi

సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ర్యాలీలో సోనియా పాల్గొనడం లేదని  పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా అనారోగ్యానికి గురయ్యారని.. అయితే వివరాలు వెల్లడించడానికి పార్టీ నేతలు నిరాకరించారు. 
 
ఆదివారం ముంబై, ధూలే, నందర్బార్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. సోనియా పర్యటన రద్దు కావడంతో ముంబైలో నిర్వహించే ర్యాలీలో శరద్ పవార్ తో కలిసి రాహుల్ గాంధీ పాల్గొంటారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర ర్యాలీలలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తో కలిసి బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ పాల్గొంటారని పార్టీ తెలిపింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement