భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

software engineer murders wife, three children - Sakshi

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. శనివారం అర్ధరాత్రి నిందితుడు సుమీత్‌ కుమార్‌ తన భార్య అన్సు బాల (32), కొడుకు ప్రతిమేశ్‌ (5)తోపాటు కవల పిల్లలైన కూతురు ఆకృతి (4), కొడుకు ఆరవ్‌ (4)లకు మత్తు కలిపిన పానీయాలు తాగించి, గొంతు కోసి చంపాడు. ఆదివారం తాము మృతదేహాలను కనుగొన్నామని వెల్లడించారు. కుమార్‌ అన్షును 2011లో వివాహమాడాడు.

గతేడాది డిసెంబర్‌లో ఉద్యోగం పోగొట్టుకుని, అప్పుల్లో కూరుకుపోయి డిప్రెషన్‌లో ఉన్నాడు. బాలా టీచర్‌గా పనిచేస్తోంది. కుమార్‌ మామ వారి కుటుంబ ఖర్చులకు సాయం చేసేవాడు. ఆదివారం కుమార్‌ వాళ్ల కుటుంబ వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ తన పిల్లలను, భార్యను ఎలా చంపాడో చెప్పాడని సిటీ సూపరింటెండెంట్‌ శ్లోక్‌ కుమార్‌ వెల్లడించారు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాననీ, అందుకోసం విషం కొనుక్కున్నానని కూడా ఆ పోస్ట్‌లో తెలిపాడని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top