ఐదో తరగతి విద్యార్థిపై ముగ్గురు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఓ ఉద్యోగి స్వలింగ సంభోగం జరిపారంటూ ముజఫర్ నగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్‌లో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఓ ఉద్యోగి కలిసి ఐదోతరగతి విద్యార్థిపై అరాచకానికి పాల్పడ్డారు. ముజఫర్‌నగర్ పోలీసుల సమాచారం ప్రకారం స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిపై ముగ్గురు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఓ ఉద్యోగి స్వలింగ సంభోగం జరిపారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
భారతీయ శిక్షాస్మృతి 377 ప్రకారం విద్యార్థిపై ప్రకృతి విరుద్ధ చర్య (అసహజ సెక్స్)కు పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తేజ్ బీర్ సింగ్ తెలిపారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగిందని, సోమవారం విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై సెక్షన్ 377, 120బి తదితర సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అసహజ సెక్స్ కేసులో నిందితులైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఉద్యోగి పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు చెబుతున్నారు.