ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు! | Reliance Power terminates UMPP | Sakshi
Sakshi News home page

ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు!

Apr 28 2015 6:07 PM | Updated on Sep 3 2017 1:02 AM

అనీల్ అంబానీ

అనీల్ అంబానీ

అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ సంస్థ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యుఎంపీపీ)నుంచి తప్పుకుంది.

ముంబై: అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ సంస్థ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యుఎంపీపీ) నుంచి తప్పుకుంది. జార్ఖాండ్లో 3960 మెగావాట్ల ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు కోసం అక్కడి ప్రభుత్వంతో రిలయన్స్ పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. 36 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది.

ఈ ప్రాజెక్టుని హజారీబాగ్ జిల్లాలో  నిర్మించతలపెట్టారు. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకొని అయిదేళ్లు పూర్తి అయినా ప్రాజెక్టుకు కావలసిన భూమిని ప్రభుత్వం సమకూర్చలేదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు రిలయన్స్ పవర్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement