ఆ ఎంపీ మళ్లీ విమానమెక్కారు! | Ravindra gaikwad boards air india flight after long gap | Sakshi
Sakshi News home page

ఆ ఎంపీ మళ్లీ విమానమెక్కారు!

Apr 20 2017 8:15 PM | Updated on Aug 17 2018 6:15 PM

ఆ ఎంపీ మళ్లీ విమానమెక్కారు! - Sakshi

ఆ ఎంపీ మళ్లీ విమానమెక్కారు!

ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను చెప్పుతో కొట్టి.. దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిరిండియా విమానం ఎక్కారు.

ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను చెప్పుతో కొట్టి.. దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిరిండియా విమానం ఎక్కారు. అది కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కారు. అంతకుముందు ఆయన ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థలలోను ఎన్నిసార్లు టికెట్లు బుక్ చేసుకున్నా అవన్నీ ఎప్పటికప్పుడు రద్దయిపోయేవి.

కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను విమానం ఎక్కించుకోవాలని చెప్పడంతో ఎయిరిండియా సహా అన్ని సంస్థలూ సరేనన్నాయి. ఆ తర్వాత తొలిసారిగా ఆయన గురువారమే విమానం ఎక్కారు. ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం వల్ల విమానాలు ఆలస్యమైతే వాళ్లకు రూ. 15 లక్షల వరకు జరిమానా విధించాలని ఎయిరిండియా ఇటీవల నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement