రాంగోపాల్ యాదవ్కు మళ్లీ పట్టం.. | Ram Gopal Yadav reinstated as Samajwadi Party General Secretary | Sakshi
Sakshi News home page

ఆయనకు మళ్లీ పట్టం కట్టిన సమాజ్ వాదీ

Nov 17 2016 10:36 AM | Updated on Sep 4 2017 8:22 PM

రాంగోపాల్ యాదవ్కు మళ్లీ పట్టం..

రాంగోపాల్ యాదవ్కు మళ్లీ పట్టం..

సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్కు ఊరట లభించింది.

న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్కు ఊరట లభించింది. మూడు వారాల క్రితం బహిష్కరణకు గురైన ఆయనను సమాజ్ వాదీ తిరిగి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియమించింది. ఈ మేరకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పేరుతో బుధవారం ఓ ప్రకటన విడుదల అయింది.

మరోవైపు పార్టీ ప్రకటనపై రాంగోపాల్ యాదవ్ గురువారం హర్షం వ్యక్తం చేశారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, ఎప్పుడూ పార్టీ గీత దాటలేదని తెలిపారు. కాగా రాంగోపాల్ యాదవ్ బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. రాజ్యసభలో సమాజ్వాదీ పక్ష నేతగా ఉన్న ఆయన పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై  సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విరుచుకుపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement