బీఏఐ అధ్యక్షుడిగా పులహండి | pulahandi elected by bai president | Sakshi
Sakshi News home page

బీఏఐ అధ్యక్షుడిగా పులహండి

Mar 30 2018 3:25 AM | Updated on Mar 30 2018 3:25 AM

pulahandi elected by bai president - Sakshi

చెరువు రామకోటయ్య

న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన భారత నిర్మాణదారుల సంఘం(బీఏఐ) అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన పులహండి ఎన్నికయ్యారు. ఐదుగురు వైస్‌ప్రెసిడెంట్లు ఉండే ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా చెరువు రామకోటయ్య ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామకోటయ్య అన్నారు. దేశవ్యాప్తంగా బీఏఐకి 165 శాఖలున్నాయనీ, వీటిలో 18,000 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ట్రావెలర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ మెంబర్‌గా సేవలందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement