పార్లమెంట్‌కు ప్రియాంక పుత్రుడు | Priyanka Vadra's Son Raihan Visits Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌కు ప్రియాంక పుత్రుడు

Jul 16 2014 10:59 PM | Updated on Sep 2 2017 10:23 AM

ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ తన స్నేహితులతో బుధవారం పార్లమెంట్‌ను తిలకించాడు. సందర్శకుల గ్యాలరీలో నుంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు.

న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ తన స్నేహితులతో బుధవారం పార్లమెంట్‌ను తిలకించాడు. సందర్శకుల గ్యాలరీలో నుంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు. సోనియాగాంధీ మనవడైన రైహాన్... స్పోర్ట్స్ జాకెట్ ధరించి వచ్చాడు. ఆ తర్వాత సెంట్రల్ హాల్‌ను తిలకించిన అనంతరం గాంధీ కార్యాలయంలో కొద్దిసేపు గడిపాడు. ఈ సందర్భం గా రైహాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎంతో బాగుందన్నాడు. ఇదిలాఉంచితే ప్రియాంక గాంధీ తన కుమారుడు రైహాన్, కుమార్తె మిరాయాలను లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ తన వెంట తీసుకెళ్లారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement