breaking news
Raihan
-
ప్రియాంక కుమారుని ఫొటో ఎగ్జిబిషన్‌పై దుమారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా ఢిల్లీలోని బీకానేర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ ఫొటో ప్రదర్శన రాజకీయ దుమారానికి దారితీసింది. రాజస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రాంగణంలో ప్రదర్శన ప్రారంభానికి కొద్ది గంటల ముందే, అందులోని మొత్తం 105 ఫొటోలలో యువజన నిరసనలకు సంబంధించిన 74 చిత్రాలను నిర్వాహకులు బలవంతంగా తొలగించారని రెహాన్ ఆరోపించారు.వాటిని తీసివేయకపోతే ఈవెంట్‌ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో గత్యంతరం లేక తొలగించాల్సి వచ్చిందని రెహాన్ పేర్కొన్నారు. తొలగించిన వాటిలో జాతీయ జెండా (త్రివర్ణ పతాకం) ఉన్న ఛాయాచిత్రాలు కూడా ఉండటం వివాదాన్ని మరింత పెంచింది. ప్రదర్శన నిబంధనల ఉల్లంఘన జరిగిందని, రాజకీయపరమైన అంశాలతో కూడిన ఫొటోలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం, సందర్భం కాదు అని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. కాగా కళాకారుల వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రెహాన్ అన్నారు. ఈ చిత్రాలు కేవలం సమాజంలో జరిగిన నిరసనల డాక్యుమెంటేషన్ మాత్రమేనని తెలిపారు. When even the Tricolour isn’t safe from the censor’s scissors, perhaps the problem isn’t the art. It’s the regime. Just hours before @raihanrvadra was to open his art show ‘No Idea Is Final’ 74 artworks - nearly half the exhibition - were taken down for being “political”, by the Bikaner House. The photographs merely documented protests, and not one was derogatory or inflammatory. So what exactly was the offence? One of the works Raihaan had to 'fight' to retain was a photograph of the Indian flag. Otherwise, the walls meant for art were left with nothing but exposed iron nails, gleaming under the spotlights - a chilling metaphor for censorship. Imagine a government so threatened by ideas that not just protests, but even photographs of protests - and the Tricolour itself - have become intolerable. The end must be close.— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) October 21, 2026ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత గొంతును, భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్య ఇది అని, ఫొటోలలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేకపోయినా ఇలా చేయడం సిగ్గుచేటని ప్రియాంక మండిపడ్డారు. బీజేపీ పాలనలో కనీసం త్రివర్ణ పతాకం చిత్రానికి కూడా చోటు లేకుండా పోయిందని, ఖాళీ గోడలపై మిగిలిన మేకులే సెన్సార్‌షిప్‌నకు నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు. ఈ వివాదంపై బీజేపీ, బీకానేర్ హౌస్ ఉన్నతాధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, మిగిలిన ఫొటోలతో అక్టోబర్ 25 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుండగా, తొలగించిన నిరసన చిత్రాలను వేరే వేదికపై త్వరలోనే ప్రజల ముందుకు తెస్తానని రెహాన్ వాద్రా తెలిపారు.ఇదీ చదవండి: ‘కంటెంట్’పై టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు -
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!
ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా లేదా వివరించేలా ఉండాలి. నిజానికి అవి చూడగానే మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలను చిన్న కెమెరాతో గొప్పగా భలే బంధించారే అనిపిస్తుంది. అందుకు ఆ వ్యక్తిలో మంచి సృజనాత్మకతో కూడిన నైపుణ్యం ఉండాల్సిందే. ఇక ఆయా ఫోటోలను సోలోగా లేదా గ్రూప్‌గా ప్రదర్శించడం అనేది కూడా ఓ ఆర్టే. ఎందుకంటే? ప్రేక్షకులను ఆక్టటుకునే థీమ్ తోపాటు వారు అటెన్షన్ పెట్టి చూసేలా సరైన క్యాచీ టైటిల్‌తో ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. ఇప్పుడూ ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ఇలాంటి ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌ని ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతగా అలరిస్తున్నాయంటే.. రైహన్ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ బికనీర్ హౌస్‌లోని లివింగ్ ట్రేడిషన్స్ సెంటర్ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ ఎగ్జిబిషన్‌ని 'ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్‌తో నిర్వహించారు. ఆ టైటిల్ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం విశేషం. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు. రైహాన్ సోలో ఎగ్జిబిషన్ 'డార్క్ పర్సెప్షన్ యాన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లైట్, స్పెస్ అండ్ టైమ్' పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్ 8 ఏళ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్ ఇన్స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో ఒక గది మొత్తం రాజస్తాన్‌లోని అభయ అరణ్యాల్లో క్లిక్ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇతర గదుల్లో లైఫ్ సైజ్ మిర్రర్లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్ చాలా శక్తిమంతమైన ట్రిక్. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమరాతో బంధించే కళ. ఇది గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్ రైహాన్ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి చెబుతుంది. ఇక రైహాన్ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. (చదవండి: నరకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ పార్క్‌కి వెళ్లాల్సిందే!) -
పార్లమెంట్‌కు ప్రియాంక పుత్రుడు
న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ తన స్నేహితులతో బుధవారం పార్లమెంట్‌ను తిలకించాడు. సందర్శకుల గ్యాలరీలో నుంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు. సోనియాగాంధీ మనవడైన రైహాన్... స్పోర్ట్స్ జాకెట్ ధరించి వచ్చాడు. ఆ తర్వాత సెంట్రల్ హాల్‌ను తిలకించిన అనంతరం గాంధీ కార్యాలయంలో కొద్దిసేపు గడిపాడు. ఈ సందర్భం గా రైహాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎంతో బాగుందన్నాడు. ఇదిలాఉంచితే ప్రియాంక గాంధీ తన కుమారుడు రైహాన్, కుమార్తె మిరాయాలను లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ తన వెంట తీసుకెళ్లారు.


