మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా | Preity Zinta files molestation complaint against Ness Wadia | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా

Jun 14 2014 9:18 AM | Updated on Jul 23 2018 8:49 PM

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా - Sakshi

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా

బాలీవుట్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ముంబాయి : బాలీవుట్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో  పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది.

ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా  ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. 

 

ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడనంత శత్రుత్వం. చివరికి వీరిద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్కి చేరటం విశేషం. మరోవైపు ప్రీతి ఫిర్యాదును నెస్ వాడియా తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement