భారత రత్న పురస్కారాల ప్రదానం | Pranab Mukherjee to get Bharat Ratna award | Sakshi
Sakshi News home page

భారత రత్న పురస్కారాల ప్రదానం

Aug 9 2019 3:07 AM | Updated on Aug 9 2019 3:07 AM

Pranab Mukherjee to get Bharat Ratna award - Sakshi

ఢిల్లీలో ప్రణబ్‌ను భారతరత్న పురస్కారంతో సత్కరిస్తున్న రాష్ట్రపతి కోవింద్‌(కుడి). నానాజీ తరఫున బంధువు విక్రమజీత్‌(ఎడమ), హజారికా తరఫున కొడుకు తేజ్‌లు పురస్కారాలు స్వీకరించారు.

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, భారతీయ జన సంఘ్‌ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్‌ హజారికాలకు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి కోవింద్‌ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్‌కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్‌ సింగ్‌కు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో అందజేశారు. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు.

‘ప్రణబ్‌ దా’ అని సన్నిహితులు ప్రేమగా పిలుచుకునే ప్రణబ్‌ ముఖర్జీ.. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతి. కాంగ్రెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్‌ భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నానాజీ దేశ్‌ముఖ్‌కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్‌ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత,  సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా.

Advertisement
 
Advertisement
Advertisement