సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ | PM Narendra Modi Discussing With CMs In Video Conference Over Corona | Sakshi
Sakshi News home page

సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Apr 27 2020 10:13 AM | Updated on Apr 27 2020 2:00 PM

PM Narendra Modi Discussing With CMs In Video Conference Over Corona - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చించారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులను, కరోనా నియం‍త్రణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రులు వివరించారు. లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎంలతో వీడియో  కాన్ఫరెన్స్‌  ప్రధాని సమీక్షించారు ఎగ్జిట్ ప్లాన్‌, దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలు ముఖ్యంగా చర్చకు వచ్చాయి. 

Advertisement
 
Advertisement
Advertisement