కరోనాతో తండ్రి మృతి.. కుమార్తెకు పాజిటివ్‌ | Padma Shri Nirmal Singh Died After Daughter Tests Corona Positive | Sakshi
Sakshi News home page

కరోనాతో తండ్రి మృతి.. కుమార్తెకు పాజిటివ్‌

Apr 4 2020 12:48 PM | Updated on Apr 4 2020 12:58 PM

Padma Shri Nirmal Singh Died After Daughter Tests Corona Positive - Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌కు చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహిత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా కరోనా వైరస్‌ సోకి మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్మల్‌ సింగ్‌ మరణం అనంతరం ఆయన కుమార్తె (35) కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే ఆమెను నిర్బంధ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె తండ్రి కరోనా కారణంగా గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వైరస్‌ సోకడంతో అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమె కాంటాక్ట్‌ అయిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. (కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి)

Advertisement
 
Advertisement
Advertisement