‘స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష లేదు’ | No 'political discrimination' in smart city selection: Centre | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష లేదు’

Feb 5 2016 3:12 AM | Updated on Sep 17 2018 4:56 PM

దేశంలో తొలి 20 స్మార్ట్ సిటీల ఎంపికలో ఎలాంటి రాజకీయ వివక్షా లేదని కేంద్రం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ : దేశంలో తొలి 20 స్మార్ట్ సిటీల ఎంపికలో ఎలాంటి రాజకీయ వివక్షా లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్మార్ట్ సిటీల ఎంపిక ప్రక్రియలో బిహార్ పట్ల వివక్ష ప్రదర్శించారని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇటీవల ప్రకటించిన జాబితా కేవలం తొలి దశకు సంబంధించినవేనని గురువారం ఇక్కడ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య  తెలిపారు. కొంతమంది ఇతర నగరాలను తొలగించినట్లు భావిస్తున్నారని అది నిజం కాదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement