రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులకు గాయాలు | Nine army soldiers injured in Jammu road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులకు గాయాలు

Feb 6 2016 5:08 PM | Updated on Aug 30 2018 3:58 PM

భారత సైనికులు ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు ప్రమాదం బారిన పడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు.

జమ్మూ:  భారత సైనికులు ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు ప్రమాదం బారిన పడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు. శనివారం జమ్మూ కశ్మీర్ లోని నాగ్రోటా జిల్లా పరిసర ప్రాంతంలో  ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి జారిపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన సైనికులను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement