జైషే మహమ్మద్‌ ఉగ్రవాది అరెస్ట్‌ | NIA Arrests Jaish Terrorist Irshad Ahmad Reshi | Sakshi
Sakshi News home page

జైషే మహమ్మద్‌ ఉగ్రవాది అరెస్ట్‌

Apr 14 2019 5:23 PM | Updated on Apr 14 2019 5:23 PM

NIA Arrests Jaish Terrorist Irshad Ahmad Reshi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌: ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ఇర్షాద్ అహ్మద్ రిషిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం అరెస్ట్‌ చేసింది 2017లో దక్షిణ కశ్మీర్‌ లెత్‌పోరాలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ జరిగిన దాడితో ఇర్షాద్‌కు సంబంధం ఉన్నట్టుగా ఎన్‌ఐఏ అనుమానిస్తుంది. కాగా, ఈ దాడిలో ఐదుగురు అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇర్షాద్‌ ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఐదో నిందితుడు. అతడు జైషే ఉగ్రసంస్థ అండర్‌ గ్రౌండ్‌ వర్కర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జైషే కమాండర్‌ నూర్‌ మహమ్మద్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులకు ఇర్షాద్‌ ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. కాగా, నిందితున్ని సోమవారం జమ్మూలోని ఎన్‌ఐఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement