
ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ సంస్థ తన పంథాను మార్చుకుని మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) కేవలం మహిళలతో జీహాదీ గ్రూప్‌ను తయారు చేస్తున్నది. దీంతో పాటు వసూళ్లను కూడా ముమ్మరం చేస్తోంది. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో మహిళా దళాన్ని తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు తుఫత్ అల్-ముమినాత్ అనే ఆన్‌లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను ఎన్‌డీటీవీ నివేదించింది.
జైష్ అధినేత మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని 'జమాత్ ఉల్ మోమినాత్' అనే మహిళా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కోర్సులో భాగంగా, జైష్ నాయకుల కుటుంబ సభ్యులు, వ్యవస్థాపకుడు మసూద్ అజార్, అతని కమాండర్ల బంధువులు, జిహాద్, ఇస్లాంకు సంబంధించి వారి 'విధుల' గురించి బోధిస్తారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే నియామక డ్రైవ్ వచ్చే నెల నవంబర్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ 'ఉపన్యాసాలు' రోజుకు 40 నిమిషాలు ఉంటాయి. అజార్ ఇద్దరు సోదరీమణులు, సాదియా అజార్, సమైరా అజార్ నాయకత్వం వహిస్తారు. ఇందులో జమాత్ ఉల్-ముమినాత్‌లో చేరేలా మహిళల్ని పోత్సహిస్తాయి. గత నెలలో బహవల్పూర్‌లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో తన చివరి బహిరంగ ప్రసంగం తర్వాత, ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ 'కోర్సు'లో చేరే ప్రతి మహిళ నుండి రూ. 156 వసూలు చేసి, వారిని ఆన్‌లైన్ సమాచార ఫారం నింపమని బలవంతం చేస్తోందట. దీంతోపాటు అజార్ తన 'విరాళాల' కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.

చదవండి: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్
కాగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ఎపుడో గుర్తించిన జైష్-ఎ-మొహమ్మద్, జమాత్ ఉల్-ముమినాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. అజార్ అక్టోబర్ 8న జమాత్ మహిళా విభాగాన్ని ప్రకటించాడు. అలాగే అక్టోబర్ 19న, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో, మహిళలను సమూహంలోకి తీసుకొచ్చేలా 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' అనే కార్యక్రమం కూడా జరిగింది.
ఇదీ చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!