పట్టాలు తప్పిన రైలు: ఇద్దరి మృతి | Narrow gauge train derails near Kalka | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు: ఇద్దరి మృతి

Sep 12 2015 4:22 PM | Updated on Aug 25 2018 6:06 PM

పట్టాలు తప్పిన రైలు: ఇద్దరి మృతి - Sakshi

పట్టాలు తప్పిన రైలు: ఇద్దరి మృతి

హర్యానా రాష్ట్రంలోని కల్కా - సిమ్లా మధ్య శనివారం మధ్యాహ్నం టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది.

సిమ్లా: హర్యానా రాష్ట్రంలోని కల్కా - సిమ్లా మధ్య శనివారం మధ్యాహ్నం టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విదేశీయలు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడినట్టు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కల్కాకు 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉత్తర జోన్ రైల్వే డివిజనల్ అధికారి దినేష్ అందించిన సమాచారం మేరకు.. 'రైల్లో నాలుగు బోగీలు పూర్తిగా పర్యాటకులతో నిండి ఉన్నాయి. ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పింది. వెంటనే సమాచారం అందడంతో అప్రమత్తమయ్యాం. రెండు బోగీలు మాత్రమే రైలు నుంచి విడిపోయాయి. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకున్నాం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించాం. రైలు వెళ్లే మార్గంలో మలుపులు ఎక్కువగా ఉండటం.. న్యారో గేజ్ రైలు కావడంతో ప్రమాదం జరిగింది' అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement