'అది చెప్పడానికే మీ దగ్గరికి వచ్చా' | Modi meets top Chinese CEOs in Shanghai | Sakshi
Sakshi News home page

'అది చెప్పడానికే మీ దగ్గరికి వచ్చా'

May 16 2015 8:21 AM | Updated on Aug 15 2018 6:32 PM

చైనాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని నరేంద్ర మోదీ - Sakshi

చైనాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని నరేంద్ర మోదీ

పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన థ్యేయంగా చైనాలో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ శనివారం షాంఘై నగరంలో చైనీస్ సీఈవోలతో భేటీ అయ్యారు. 'మేక్ ఇన్ ఇండియా అని మీతో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను' అని మోదీ సీఈవోలతో అన్నారు.

పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా చైనాలో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ శనివారం షాంఘై నగరంలో చైనీస్ సీఈవోలతో భేటీ అయ్యారు. 'మేక్ ఇన్ ఇండియా అని మీతో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను' అని మోదీ సీఈవోలతో అన్నారు. ఈ భేటీలో అలీబాబా సంస్థ అధిపతి జాక్ మా సహా చైనాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ప్రాజెక్టులు తమను ఆకర్షిస్తున్నాయని, భారత్లో పెట్టుబడులకు తాము సానుకూలంగా ఉన్నమని సీఈవోలు ప్రధాని మోదీతో అన్నారు. భారత్ పై తమకు నమ్మకం ఉందని, అద్భుతమైన నిపుణులు, విస్తారమైన మార్కెట్ భారత్ సొంతమని సీఈవోలు పేర్కొన్నారు. కాగా నేటి షాంఘై సందర్శనతో ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటన ముగియనుంది. ఈ రోజు సాయంత్రం ఆయన మంగోలియాకు బయలుదేరుతారు.

Advertisement
 
Advertisement
Advertisement