మోదీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు | Modi Greets People of India 'Merry Christmas' Through Twitter | Sakshi
Sakshi News home page

మోదీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Dec 25 2017 8:48 AM | Updated on Aug 15 2018 2:32 PM

Modi Greets People of India 'Merry Christmas' Through Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ ప్రజలకు క్రిస్మస్‌ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్‌ సమాజంలో  సుఖశాంతులు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ప్రధానమంత్రి అటల్‌ బీహారీ వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రపంచం దేశాల ముందు భారత్‌ ఉన్నత స్ధానంలో నిలవడానికి వాజ్‌పేయి దూరదృష్టే కారణమని కొనియాడారు. ఇదే రోజున జన్మించిన పండిట్‌ మదన్ మోహన్‌ మాళవీయను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. భారత చరిత్రపై మాళవీయ వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిదని అన్నారు. విద్యా రంగం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement