కశ్మీర్‌ పరిస్థితులపై కాంగ్రెస్‌ ఆరా | Manmohan Singh in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ పరిస్థితులపై కాంగ్రెస్‌ ఆరా

Sep 16 2017 8:10 PM | Updated on Sep 19 2017 4:39 PM

కశ్మీర్‌ పరిస్థితులపై కాంగ్రెస్‌ ఆరా

కశ్మీర్‌ పరిస్థితులపై కాంగ్రెస్‌ ఆరా

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ఒక బృందం కశ్మీర్‌ పరిస్థితులను తెలుసుకునేందుకు శనివారం శ్రీనగర్‌ చేరుకుంది.

సాక్షి, శ్రీనగర్‌ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ఒక బృందం కశ్మీర్‌ పరిస్థితులను తెలుసుకునేందుకు శనివారం శ్రీనగర్‌ చేరుకుంది. మన్మోహన్‌ బృందం రెండు రోజుల పాటు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలు, ఇతర అంశాలపై పరిశీలన చేయనుంది. అలాగే లోయలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతుంది. జమ్మూ బార్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌లతోనూ చర్చలు జరపనుంది. అంతేకాక యూపీఏ భాగస్వామ్య పక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు, వివిధ పక్షాల నాయకులు, సామాజిక కార్యకర్తలతో మన్మోహన్‌ బృందం చర్చలు జరపనుంది.

ఈ బృందంలో మన్మోహన్‌ సింగ్‌తో పాటు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ అంబికా సోని, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌ ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement