ఇండియా- నేపాల్‌ సరిహద్దు వివాదంలో హీరోయిన్‌! | Manisha Koirala Getting troll By Indians On Nepal India Boarder issue | Sakshi
Sakshi News home page

మనీషా పై నెటిజన్లు ఫైర్‌ కారణమిదే!

May 21 2020 12:17 PM | Updated on May 22 2020 5:15 PM

Manisha Koirala Getting troll By Indians On Nepal India Boarder issue - Sakshi

ముంబాయి: ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా ఉన్న ఇండియా- నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్‌ పై ఘాటుగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి భారత్‌ కూడా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలా కూడా చిక్కుకున్నారు. ఈ వివాదం పై ఆమె స్పందిస్తూ ‘మా చిన్న దేశం గౌరవాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. మూడు గౌరనీయమైన దేశాల మధ్య శాంతిపూర్వక, మర్యాదప్రదమైన సంప్రదింపులు జరగాలని ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది. అయితే ఈ విషయంలో నెటిజన్లు మనీషా పై ఫైర్‌ అవుతున్నారు. ఈ ట్వీట్‌పై ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. (భారత్పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!)

దీనిపై ఒక నెటిజన్‌ స్పందిస్తూ ‘ మనీషా బేటా నువ్వు మనసుతో ఆలోచించూ లేక పోతే సిగ్గుంటే ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండూ దీనిని రాజకీయం చెయ్యొద్దు. మీరు చైనాతో ఉన్నారు. మీ ప్రేమను దాచి ఉంచుకోండి లేకపోతే నువ్వు ముంబాయిలో సంపాదించింది మొత్తం పోతుంది’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ మనీషాని ట్రోల్‌ చేస్తున్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ నేపాల్‌  విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను ఆ దేశ కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్‌ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్‌ కంటే, ఇటలీ వైరస్‌ కంటే ఇండియా వైరస్‌ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడిన సంగతి విదితమే. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్)

Advertisement
 
Advertisement
Advertisement