లాక్‌డౌన్‌ : మహారాష్ట్ర కీలక నిర్ణయం

Maharashtra extends lockdown in hotspot areas - Sakshi

 ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు

ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ 

సహా  హాట్‌ స్పాట్‌లలో  మే 31 వరకు లాక్‌డౌన్‌

సాక్షి, ముంబై:  ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్టపడకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం   కీలక నిర్ణయం తీసుకుంది.  హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో ఈ నెల (మే 31 ) చివరి వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్టు ప్రకటించింది.   ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశంపై చర్చించామని  రాష్ట్ర ప్రభుత్వ అధికారి  ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రదేశాల్లో లాకడౌన్ 3.0  ముగిసేలోపు  కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా  నిర్ణయం తీసుకుంటామన్నారు. (లాక్‌డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం  )
 
కాగా  బుధవారం రాత్రికి మహారాష్ట్రలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 25922 కు చేరగా,  975 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రధానంగా  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ కారణంగా  596 మంది మరణించారు. మరోవైపు  ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం  దేశంలో కరోనా వైరస​ కేసుల సంఖ్య 81970 కు చేరగా,  మరణాల సంఖ్య  2649  చేరింది.  దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడవ దశ లాక్‌డౌన్‌ మే17వతేదీతో ముగియనుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్‌డౌన్‌ కొనసాగనుందని సూచించిన సంగతి తెలిసిందే.

చదవండి : మూడ్ లేదు.. ఇక తెగతెంపులే 
వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top