లాక్‌డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం  

stockmarkets opens lower by 200 points - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  నష్టాల్లో ప్రారంభమైనాయి  ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ,  ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయి 30918, వద్ద, నిఫ్టీ 47పాయింట్లు నష్టంతో 9095 వద్ద కొనసాగుతోంది. లాభ నష్టాల మధ్య తీవ్ర  ఊగిసలాట ధోరణి నెలకొంది. ఫార్మ మినహా  అన్ని రంగాలు నష్టాల్లోనే  కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్స్, ఆటో రంగ షేర్లు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి.  దీంతో కీలక సూచీలు రెండూ  ప్రధాన మద్దతు స్థాయిల దిగువకు చేరాయి. సెన్సెక్స్ 31వేల మార్క్, నిఫ్టీ 91 వందల దిగువకు చేరింది.  బ్యాంకు నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయి 19 వేల మార్క్ దిగువకు చేరింది. మరోవైపు కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రధాన పారిశ్రామిక నగరాల్లో మే 31వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రభావాన్ని చూపిస్తోందని విశ్లేషకులు తెలిపారు.  (మార్కెట్లకు ప్యాకేజీ నచ్చలే..!)

చదవండి : మూడ్ లేదు.. ఇక తెగతెంపులే 
వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top