రుణమాఫీతో ప్రజా ధనం వృధా: హజారే | Loan waiver to farmers a waste of public money: Anna Hazare | Sakshi
Sakshi News home page

రుణమాఫీతో ప్రజా ధనం వృధా: హజారే

Sep 18 2015 8:07 AM | Updated on Oct 1 2018 2:09 PM

రుణమాఫీతో ప్రజా ధనం వృధా: హజారే - Sakshi

రుణమాఫీతో ప్రజా ధనం వృధా: హజారే

రైతు రుణమాఫీ పథకం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు చేసే ఓ పొలిటికల్ జిమ్మిక్కని సామాజిక కార్యకర్త అన్నాహజారే మండిపడ్డారు.

పూణే: రైతు రుణమాఫీ పథకం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు చేసే ఓ పొలిటికల్ జిమ్మిక్కని సామాజిక కార్యకర్త అన్నాహజారే మండిపడ్డారు. దీని వల్ల ప్రజల(టాక్స్ పేయర్స్) డబ్బును వృథా చేయడం తప్ప, సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. గతంలోనూ రుణ మాఫీ చేయడం వల్ల  రైతులకు ఒక పరిష్కరం చూపేలా ఉపయోగపడలేదని తెలిపారు. ఈ పథకం రైతులు ఒకరిపై ఆధారపడి బతికేలా, నిస్సహాయ పరిస్థితిని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.

శరద్ పవార్(ఎన్సీపీ), బీజేపీ మిత్రపక్షం శివసేనలు కరువు ప్రాంతంలోని రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కరువు ను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోకుండా దీన్ని నాయకులు ఒక రాజకీయ సమస్యలా చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులుగా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద డ్యాం లు నిర్మించడంపైనే శ్రద్ధ పెట్టారని, ఎన్ని డ్యాంలు నిర్మించినా ఇంకా నీటి సమస్య అలాగే ఉందన్నారు. రైతులకు అవసరమై ప్రాజెక్టులు కట్టడంకన్నా రాజకీయనాయకులకు ఉపయోగం చేకురే ప్రాజెక్టులనే ఎక్కువగా నిర్మించారన్నారు. కరువును దీర్ఘకాలికంగా ఎదుర్కొవాలంటే గ్రామాల్లో వాటర్ షెడ్ను నిర్మించాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement