కార్లకు రుణమాఫీ చేయండి | NSFDC beneficiaries protest at SC Corporation MDs office | Sakshi
Sakshi News home page

కార్లకు రుణమాఫీ చేయండి

Mar 25 2026 5:19 AM | Updated on Mar 25 2026 5:19 AM

NSFDC beneficiaries protest at SC Corporation MDs office

ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ కార్యాలయం వద్ద ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ లబ్దిదారుల ధర్నా

సాక్షి, అమరావతి: ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ద్వారా ఇచ్చిన ‘థాంక్యూ సీఎం సార్‌’ కార్లపై ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) కార్యాల­యం వద్ద లబ్దిదారులు ధర్నా చేశారు. రాష్ట్రం నలు­మూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ లబ్దిదారులు మంగళవారం ధర్నా అనంతరం తమకు రుణ­మాఫీ చేయాలని కోరుతూ ఎండీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ షెడ్యూల్డ్‌ కులా­ల ఆర్థిక, అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), జాతీ­య సఫాయి కర్మచారీ­స్‌ ఆర్థిక, అభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) ఆర్థిక సహకారంతో 2016 నుంచి 2019 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభు­త్వం ఎస్సీ, ఎస్టీల కోసం ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ కార్లు అందించిందన్నారు. వాటిని స్థానిక అధి­కారులకు అద్దెకు పెట్టుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. వాస్తవానికి ఆ కార్లను అధికారులకు అద్దెకు పెట్టుకోలేదని, ఆ తర్వాత కిరాయిలు కూడా లేక అప్పులు చేసి మరీ కిస్తీలు చెల్లించామని వాపోయారు. 

కిస్తీల కోసం అధి­కారుల వేధింపులు పెరిగాయని వాపోయారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే కార్లు సీజ్‌ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్లు ప్రయోజనాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచి్చన కా­ర్ల­కు రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement