లాలూ కూతురు, అల్లుడికి ఐటీ సమన్లు | Lalu's Daughter Misa Summoned by IT Department for Questioning | Sakshi
Sakshi News home page

లాలూ కూతురు, అల్లుడికి ఐటీ సమన్లు

May 25 2017 1:24 AM | Updated on Sep 5 2017 11:54 AM

లాలూ కూతురు, అల్లుడికి ఐటీ సమన్లు

లాలూ కూతురు, అల్లుడికి ఐటీ సమన్లు

రూ.వెయ్యి కోట్లు బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఆర్‌జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్‌కు ఆదాయపు పన్ను శాఖ సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ: రూ.వెయ్యి కోట్లు బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఆర్‌జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్‌కు ఆదాయపు పన్ను శాఖ సమన్లు జారీ చేసింది.

మే 22న వీరి అకౌంటెంట్‌ రాజేశ్‌కుమార్‌ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా జూన్‌ మొదటి వారంలో ఎంపీ భారతి, శైలేశ్‌కుమార్‌ తమ ముందు హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.  కాగా ఐటీ దాడులతో తనను మాట్లాడకుండా ఆపడం బీజేపీకి సాధ్యం కాదని లాలూ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement