Income Tax: అందుబాటులోకి ఐటీఆర్‌–2 | itr2 ay 2026 27 filing portal open income tax department | Sakshi
Sakshi News home page

Income Tax: అందుబాటులోకి ఐటీఆర్‌–2

May 28 2026 5:27 PM | Updated on May 28 2026 5:34 PM

itr2 ay 2026 27 filing portal open income tax department

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2026–27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి (2025–26 ఆర్థిక సంవత్సరం) ఐటీఆర్‌–2 (రిటర్నుల పత్రం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ ఫైలింగ్‌ పోర్టల్‌పై రిటర్నుల దాఖలు సాధ్యపడుతుంది.

వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎలాంటి ఆదాయం లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), మూలధన లాభాలు ఆర్జించి ఉంటే ఐటీఆర్‌–2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15న ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–4 పత్రాలను సైతం ఆదాయపన్ను శాఖ అందుబాటులోకి తేవడం గమనార్హం. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌–1, 2 దాఖలుకు జూలై 31 తుది గడువుగా ఉంది.

అదనంగా, ఈసారి ఐటీఆర్‌–2 ఫారంలో పన్ను చెల్లింపుదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, అధిక విలువ గల పెట్టుబడుల వివరాలను మరింత స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే ముందుగా నింపిన సమాచారం (ప్రీ–ఫిల్డ్‌) సౌకర్యాన్ని కల్పించడం వల్ల బ్యాంక్ వడ్డీలు, డివిడెండ్‌లు, టీడీఎస్‌ వివరాలు ఆటోమేటిక్‌గా కనిపించే అవకాశం ఉంది. దీంతో రిటర్నుల దాఖలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement